భారత అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత్యున్నత పురస్కారం ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’కు ఎంపికయ్యాడు.
ఇటీవలే ప్రకటించిన ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్న బుమ్రా, వార్షిక టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నారు.
ఇప్పుడు అతడిని వార్షిక ఉత్తమ క్రికెటర్‌కు ఇచ్చే గ్యారీ సోబర్స్ అవార్డుతో ఐసీసీ గౌరవించింది.
మరోవైపు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ 2024కు మహిళల్లో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది.