Published on Jan 28, 2025
Current Affairs
జస్‌ప్రీత్‌ బుమ్రా
జస్‌ప్రీత్‌ బుమ్రా

భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను 2024 ఏడాదికి గాను మేటి టెస్టు క్రికెటర్‌గా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) 2025, జనవరి 27న ఎంపిక చేసింది.

ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా ఉన్న బుమ్రా.. గత 12 నెలల్లో 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు.

2024లో అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక వికెట్ల తీసింది బుమ్రానే.  ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ అయిదు మ్యాచ్‌ల్లో 32 వికెట్లతో అదరగొట్టాడు.

ఈ క్రమంలోనే టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకున్న 12వ భారత బౌలర్‌గా నిలిచాడు.