భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ 2025, అక్టోబరు 27న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 24న బాధ్యతలు చేపడతారు. నవంబరు 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు.
ప్రస్తుతం సీనియారిటీలో గవాయ్ తర్వాతి స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. నవంబరు 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు.