Published on Nov 14, 2024
Current Affairs
జస్టిస్‌ సూర్యకాంత్‌
జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ సూర్యకాంత్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా నామినేట్‌ చేశారు.

ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) 2024, నవంబరు 13న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఇది వరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌.. అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా నియమితులయ్యారు.