Published on Dec 23, 2024
Current Affairs
జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌
జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఆ పదవిలో ఆయన 12 నవంబరు 2028 వరకు కొనసాగుతారు.

1953లో జన్మించిన జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ జూన్‌ 4, 2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబరు 30, 2018న పదవీ విరమణ చేశారు.

2019లో ఆయన ఫిజీ సుప్రీంకోర్టులో నాన్‌ రెసిడెంట్‌ ప్యానెల్‌ జడ్జిగా నియమితులయ్యారు.

విదేశానికి చెందిన సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి ఆయనే.