భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025, మే 14న ప్రమాణం చేశారు.
రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు.
జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ తర్వాత సీజేఐ అయిన రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్.
బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తి ఆయనే.
1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన ఆయన 1985లో న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
సీజేఐగా ఆయన 2025, నవంబరు 23 వరకు కొనసాగుతారు.