సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ 2025, మార్చి 17న బాధ్యతలు చేపట్టారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు.
జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ఇప్పటివరకూ కలకత్తా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ఆరేళ్లకు పైగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆ వ్యవధిలో ఆయన సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం ఉంది.