మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ పదవీకాలాన్ని మరో ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు 2024, నవంబరు 1న నోటిఫికేషన్ జారీచేసింది.
* 2022 అక్టోబరులో ఏర్పాటైన ఈ కమిషన్‌కు తుది నివేదిక అందించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. అది గత అక్టోబరు 10తో ముగిసిన నేపథ్యంలో తాజాగా దాన్ని 2025 అక్టోబరు పదో తేదీ వరకు పొడిగించింది.