Published on Nov 12, 2024
Current Affairs
జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌
జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు.

మాజీ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీ విరమణతో ఈ కొలీజియంను పునరుద్ధరించాల్సి వచ్చింది.

ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నాతో పాటు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ సభ్యులుగా ఉండే కొలీజియం సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది.