Published on Dec 16, 2024
Current Affairs
జెంషెడ్‌జీ టాటా పురస్కారం
జెంషెడ్‌జీ టాటా పురస్కారం

బయోకాన్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజందార్‌ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్‌జీ టాటా పురస్కారం దక్కింది. మన దేశంలో బయోసైన్సెస్‌ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ అవార్డును ప్రకటించింది. 2004లో ఐఎస్‌క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్‌క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్‌ 2024లో కిరణ్‌కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు.