Published on Dec 12, 2025
Current Affairs
జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం
జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం
  • గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి ‘జల సంచాయ్‌-జన భాగిదారి’ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా 2025లో 4,20,146 పనులు ప్రారంభించి, ఇప్పటివరకు 2,99,114 పూర్తి చేసింది. మిగతా 1,21,032 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం మొదటి పది రాష్ట్రాలను ఎంపిక చేసింది. 
  • బిహార్, గుజరాత్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచినట్లు చెప్పారు.