ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, జలవనరుల శాఖ మంత్రి ఉపాధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్‌లో జలహారతి కార్పొరేషన్ ఏర్పాటయింది.
వరద జలాల సద్వినియోగానికి దీన్ని ప్రభుత్వ ఎంటర్‌ప్రైజస్‌గా పేర్కొన్నారు.
పోలవరం- బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు చేపట్టేందుకు దీన్ని ప్రత్యేక వాహక నౌక (ఎస్‌పీవీ)గా ఏర్పాటు చేశారు.
ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ 2025, ఏప్రిల్ 8న ఉత్తర్వులు ఇచ్చారు.