జేఎన్టీయూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హాకథాన్-2025’ పురస్కారం వరించింది. ప్రతి ఇంటిపై పడే వర్షపు నీటిని ఒడిసిపట్టేందకు ‘హైడ్రో హార్వెస్ట్ ఏఐ’ పేరుతో ఆయన చేసిన ఆవిష్కరణకు ఈ అవార్డు దక్కింది. కృత్రిమ మేధ(ఏఐ), జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపిందించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా దిల్లీలోని డా.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్(డీఏఐసీ)లో నిర్వహించిన కార్యక్రమంలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నుంచి అవార్డుతో పాటు రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందుకున్నారు.
శివకుమార్‌ది ఆదిలాబాద్ జిల్లా కోర్ట గ్రామం. జేఎన్టీయూ హైదరాబాద్ జియో ఇన్‌ఫర్‌మేటిక్స్ విభాగంలో మూడో ఏడాది చదువుతున్నారు.