Published on Dec 16, 2024
Current Affairs
జల్‌వాహక్‌
జల్‌వాహక్‌

అంతర్గత నీటిమార్గాల్లో సరకు రవాణా ప్రోత్సాహానికి ‘జల్‌వాహక్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జాతీయ జలమార్గాలు 1 (గంగా), 2 (బ్రహ్మపుత్ర), 16 (బరాక్‌ నది) ద్వారా స్థిరమైన, తక్కువ ఖర్చుతో రవాణాను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024, డిసెంబరు 15న మూడు కార్గో నౌకలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రి శర్బానంద సోనోవాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం కింద కార్గో యాజమానులు 300 కి.మీ వరకు దూరానికి సరకు రవాణా చేస్తే, ఇందుకు సంబంధించి అయ్యే ఖర్చుల్లో 35% వరకు వెనక్కి పొందొచ్చు. ఈ పథకం మూడేళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇన్‌లాండ్‌ అండ్‌ కోస్టల్‌ షిప్పింగ్‌ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.