Published on Feb 17, 2025
Current Affairs
జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌
జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌

క్వాంటమ్‌ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ను ఖరగ్‌పుర్‌ ఐఐటీ పరిశోధకులు రూపొందించారు.

ఈ లేజర్‌ నానో స్థాయి సూక్ష్మ లేజర్‌ టెక్నాలజీని విప్లవీకరిస్తుంది. కాంతి కిరణం పాదార్థిక అణువులను ఢీకొన్నప్పుడు చెల్లాచెదురవుతుంది.

ఆ క్రమంలో అణువుల శక్తిలో మార్పు వస్తుంది. దీన్నే రామన్‌ శ్కాటరింగ్‌ లేదా రామన్‌ ఎఫెక్ట్‌ అంటారు. 

జీరో థ్రెషోల్డ్‌ రామన్‌ లేజర్‌ క్వాంటమ్‌ కాంతి పౌనఃపున్యాన్ని మార్చేస్తూనే క్వాంటమ్‌ స్వభావానికి భంగం కలగకుండా చూస్తుంది.

ఈ లక్షణం క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ సాంకేతికతలకు ఎంతో ఉపకరిస్తుంది.