Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 2, 2026
Current Affairs
జీరో డిస్‌క్రిమినేషన్‌ డే
జీరో డిస్‌క్రిమినేషన్‌ డే

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలా కాకుండా పేదరికం, కులం, తెగ, లింగం, ప్రాంతీయ భేదాలు, ఆరోగ్యం లాంటి కారణాలతో సమాజంలో ప్రజలు, వర్గాల మధ్య భేదభావాన్ని చూపడాన్ని వివక్ష అంటారు. దీని వల్ల ఎందరో వ్యక్తులు తమ హక్కులను కోల్పోతున్నారు. దీన్ని అధిగమించి సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవం, సమన్యాయం దక్కాలనే లక్ష్యంతో ఏటా మార్చి 1న ‘జీరో డిస్‌క్రిమినేషన్‌ డే’గా నిర్వహిస్తారు. వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు పోరాడాల్సిన ఆవశ్యతను తెలియజేయడంతోపాటు సమసమాజ ఏర్పాటును ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యక్రమం ‘యూఎన్‌ఎయిడ్స్‌’ చొరవ ఫలితంగా ‘జీరో డిస్‌క్రిమినేషన్‌ డే’ ఉనికిలోకి వచ్చింది. 2013, డిసెంబరు 1న ‘వరల్డ్‌ ఎయిడ్స్‌ డే’ నాడు ప్రారంభించిన జీరో డిస్‌క్రిమినేషన్‌ ప్రచారం నుంచి ఈ రోజు ఆవిర్భవించింది.