ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా 2025, డిసెంబరు 15న జోర్డాన్ చేరుకున్నారు. దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చర్చించారు. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ నొక్కిచెప్పారు.
భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక పర్యటన కోసం జోర్డాన్‌కు రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.