అమెరికా వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త జయ్ భట్టాచార్య నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2024, నవంబరులో ఎన్‌ఐహెచ్ 18వ డైరెక్టర్‌గా భట్టాచార్యను నామినేట్ చేశారు.
తాజాగా 53-47 ఓట్లతో ఆయన నియామకాన్ని యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.