ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డికి జియోస్పేషియల్ వరల్డ్ నుంచి లివింగ్ లెజెండ్ పురస్కారం లభించింది. మన దేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా జియోస్పేషియల్ పరిశ్రమ విస్తరణకు విశేషంగా కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు జియోస్పేషియల్ వరల్డ్ వెల్లడించింది. ఇటీవల జరిగిన జియో స్మార్ట్ ఇండియా 25వ సదస్సులో బీవీఆర్ మోహన్‌రెడ్డికి ఈ అవార్డును అందించారు.