Published on Dec 21, 2024
Current Affairs
జ్యోష్న రికార్డు స్వర్ణం
జ్యోష్న రికార్డు స్వర్ణం

భారత వెయిట్‌లిఫ్టర్‌ జోష్న సబర్‌ యూత్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గింది.

2024, డిసెంబరు 20న దోహాలో జరిగిన యూత్‌ బాలికల 40 కేజీల విభాగంలో జోష్న 135 కిలోలు (స్నాచ్‌ 60 కేజీలు + క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 75 కేజీలు) బరువులెత్తి సరికొత్త రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది. 

యూత్‌ బాలికల 45 కేజీలలో పాయల్‌ 155 కిలోలు (70+85) బరువులెత్తి బంగారు పతకం సాధించింది.

జూనియర్‌ బాలికల 45 కేజీల విభాగంలో పాయల్, యూత్‌ బాలుర 49 కేజీలలో బాబూలాల్‌ హేమ్‌బ్రోమ్‌ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.