హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. కన్సల్టెంట్: 01 పోస్టు
2. ప్రాజెక్ట్ బయాలజిస్ట్: 01 పోస్టు
అర్హత: పీజీ(అగ్రికల్చర్ ఎంటమాలజీ/ వైల్డ్‌లైఫ్ బయాలజీ/ జువాలజీ/ బోటనీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.50,000; ప్రాజెక్ట్ బయాలజిస్ట్‌కు రూ.35,000.
ఇంటర్వ్యూ తేదీ: 30-12-2024.
వేదిక: పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్.
Website:https://www.pjtsau.edu.in/