ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ (86) 2025, మే 20న పుణెలో మరణించారు.
ఆయన 1938, జులై 19న జన్మించారు.
పైచదువుల కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లినన నార్లికర్.. తనకు డాక్టోరల్ సలహాదారుగా వున్న ఫ్రెడ్ హాయ్ల్‌తో కలిసి హాయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు.
1965లో కేంద్ర ప్రభుత్వం ఆయనను 26 ఏళ్ల పిన్నవయసులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
2004లో ఆయన పద్మవిభూషణ్ అవార్డును, 2011లో మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందుకున్నారు.
మరాఠీలో రాసిన ఆయన ఆత్మకథకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.