సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) జూన్-2025కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్. దీనితో పాటు జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.
వివరాలు:
జాయింట్ సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2025
మొత్తం పరీక్ష పేపర్లు:
1. కెమికల్ సైన్సెస్
2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
3. లైఫ్ సైన్సెస్
4. మ్యాథమేటికల్ సైన్సెస్
5. ఫిజికల్ సైన్సెస్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు ఉండాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జులై 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/ పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(ఎన్‌సీఎల్) రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.06.2025.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 24.06.2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 25.06.2025 నుంచి 26.06.2025 వరకు.
పరీక్షల తేదీలు: జులై 26, 27, 28.
Website:http://https//csirnet.nta.ac.in/
Apply online:https://csirnet.ntaonline.in/