Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 3, 2026
Admissions
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 సెషన్‌-2
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 సెషన్‌-2

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌-2025 తుది విడత పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 09 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు మెయిన్‌ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. 

వివరాలు:

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 సెషన్‌-2

అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2024, 2025లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2026లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2026 పరీక్షకు హాజరు కావచ్చు.

జేఈఈ మెయిన్‌ ఎందుకంటే?

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్‌ సీట్లున్నాయి. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.

బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్‌-2, బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష జరుపుతారు. బీఆర్క్‌కు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. 

ఎన్‌టీఏ స్కోర్‌ కోసం తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు లేదా అంతకు మించి విద్యార్థులకు సమాన స్కోర్‌ వస్తే తక్కువ మైనస్‌ మార్కులను చూస్తారు.  

ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు.

పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఇస్తారు. పేపర్‌-1 300, పేపర్‌-2 400 మార్కులకు ఉంటుంది.

దరఖాస్తులో మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ చిరునామాను విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించినది ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్‌టీఏ తెలిపింది.

రెండో విడత దరఖాస్తుల షెడ్యూల్‌ 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు.

పరీక్షలు: ఏప్రిల్‌ 2 నుంచి 9 మధ్య.

ఫలితాలు: ఏప్రిల్‌ 20 నాటికి.

Website:https://jeemain.nta.nic.in/