Published on Sep 19, 2024
Current Affairs
జమిలి ఎన్నికలు
జమిలి ఎన్నికలు

కేంద్ర క్యాబినెట్‌ 2024, సెప్టెంబరు 18న పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. 

దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు:

* దేశవ్యాప్తంగా 1951 నుంచి 1967 వరకు దేశంలోని అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిగాయి. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలని 1999లో లా కమిషన్‌ పేర్కొంది. 2015లో పార్లమెంటరీ కమిటీ కూడా అదే విషయాన్ని సిఫార్సు చేసింది.

జమిలిని సాధ్యం చేయడంలోని సవాళ్లు

*  దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడంతోపాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

* రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. పార్లమెంటుతోపాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు.. అంటే 14 రాష్ట్రాలకుపైగా జమిలికి అంగీకరించాలి. ప్రస్తుతం భాజపా సారథ్యంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో (భాజపా సొంతంగా 13 రాష్ట్రాల్లో) అధికారంలో ఉంది.