అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలో 2024, డిసెంబరు 29న మరణించారు.
కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడు. 1977-81 మధ్య ఆ పదవిలో ఉన్నారు.
ఇప్పటిదాకా అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసినవారిలో అత్యధిక కాలం జీవించింది ఈయనే.
కార్టర్ డెమోక్రాటిక్ పార్టీ నేత. ఈయనకు 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.