Published on Dec 22, 2025
Current Affairs
జెమ్‌
జెమ్‌

ప్రభుత్వరంగ సంస్థలకు అవసరమైన సేవలు, వస్తు సామగ్రి ని సమీకరించేందుకు నిర్వహిస్తున్న ది గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ ప్లేస్‌ (జెమ్‌) ద్వారా ఇప్పటివరకు 11.25 లక్షలకు పైగా ఎంఎస్‌ఈ (సూక్ష్మ, చిన్న సంస్థ)లకు రూ.7.44 లక్షల కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు లభించాయి. వాణిజ్య - పరిశ్రమల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. జెమ్‌ సమీకరించే ఉత్పత్తుల్లో, ఎంఎస్‌ఈల వాటా 25% తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా, అంతకుమించి ఈ సంస్థల నుంచి సమీకరణ గత నెలకే 44.8 శాతానికి చేరింది.