Published on Feb 28, 2025
Current Affairs
జాబిల్లిపైకి డ్రోన్‌
జాబిల్లిపైకి డ్రోన్‌

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగేలా ‘అథీనా’ అనే ల్యాండర్‌ను ప్రయోగించింది.

అందులో ఓ డ్రోన్‌ను పంపించింది. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా 2025, ఫిబ్రవరి 27న దీన్ని ప్రయోగించారు. ఇది మార్చి 6న జాబిల్లిపై దిగనుంది.

ఈ ల్యాండర్‌ ఎత్తు 15 అడుగులు. చందమామ దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్‌ అయ్యేలా దీనికి లక్ష్యాన్ని నిర్దేశించారు.

జాబిలిపై సూర్య కిరణాలు ఎన్నడూ పడని జెట్‌ బ్లాక్‌ బిలానికి దాదాపు 400 మీటర్ల దూరంలోనే ఆ ప్రాంతం ఉంది.