జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి రాజస్థాన్ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వం వహించనున్నారు.
2024, డిసెంబరు 20న స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పీపీ చౌధరి రాజస్థాన్‌లోని పాళి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలిరోజు తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు.