Published on Jan 25, 2025
Government Jobs
జిప్‌మర్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు
జిప్‌మర్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

1. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ - 2 (జూనియర్‌ స్కేల్‌)

2. జనరల్‌ డ్యూటీ ఆఫీసర్

విభాగాలు: అనస్తీషియాలజీ, కార్డియోలజీ, రేడియోడయాగ్నోసిస్‌, నెఫ్రాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలోఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ -2  పోస్టులకు 40 ఏళ్లు; జనరల్‌ డ్యూటీ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది.

వేతనం: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ -2 పోస్టులకు రూ.1,24,297; జనరల్‌ డ్యూటీ ఆఫీసర్ పోస్టులకు రూ.1,03,000.

పని ప్రదేశాలు: పుదుచ్చేరి, కరైకల్‌.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీలకు రూ. 250, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను  ‘శ్రీ హవా సింగ్‌, రూమ్‌ నంబరు -210, 2వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, జిప్‌మర్‌, పుదుచ్చేరి.’ చిరునామాకు పంపంచాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025.

Website:https://jipmer.edu.in/