జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు 2025, సెప్టెంబరు 7న ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2024లో ఫుమియో కిషిద రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇషిబా.. అక్టోబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.