Published on Sep 28, 2024
Current Affairs
జపాన్‌ ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా
జపాన్‌ ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా

జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. 2024, సెప్టెంబరు 27న జరిగిన అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2024, అక్టోబరు 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎల్‌డీపీ అధ్యక్షుడిగా 2021లో కిషిద ఎన్నికయ్యారు. ఆయన మూడేళ్ల పదవీకాలం 2024 సెప్టెంబరుతో ముగుస్తుంది. దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు.