Published on Oct 2, 2024
Current Affairs
జపాన్‌ ప్రధానిగా షిగేరు ఇషిబా
జపాన్‌ ప్రధానిగా షిగేరు ఇషిబా

లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధిపతి షిగేరు ఇషిబాను కొత్త ప్రధాన మంత్రిగా జపాన్‌ పార్లమెంటు 2024, అక్టోబరు 1న లాంఛనంగా ఎన్నుకుంది. ప్రధాని పదవిలో ఉన్న ఫుమియో కిషిదా తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. అక్టోబరు 27న పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించాలని ఇషిబా యోచిస్తున్నారు.