జపాన్‌లో వరుసగా 9వ ఏడాదీ జననాల రేటు తగ్గింది. తాజాగా 2024లో జననాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే మరో 5 శాతం పతనమై 7,20,988గా నమోదయ్యాయి.
1899 తర్వాత జపాన్‌లో ఇంత తక్కువగా జననాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ 2025, ఫిబ్రవరి 27న వెల్లడించింది.
జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో మరణాల రేటు మాత్రం 1.8 శాతం పెరిగి 16 లక్షలకు చేరింది.
ఇదే ఒరవడి కొనసాగితే 2060 నాటికి జనసంఖ్య 8.67 కోట్లకు పడిపోతుందని అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం ఇప్పటికే పబ్లిక్ రుణాలు జీడీపీ కంటే 232.7 శాతం వరకు ఉన్నాయి.