Published on Dec 3, 2025
Current Affairs
జన గణన
జన గణన
  • దేశంలో జన గణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన జరుగుతుందని 2025, డిసెంబరు 2న లోక్‌సభకు తెలిపింది. అదే సమయంలో కుల గణనను కూడా చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
  • తొలి దశలో... గృహాల లిస్టింగ్, గణన (2026 ఏప్రిల్‌-సెప్టెంబరు) -  రెండో దశలో... జనాభా లెక్కల సేకరణ (2027 ఫిబ్రవరి- మార్చి 1) నిర్వహిస్తారు.
  • లద్ధాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లోని ప్రతికూల వాతావరణ ప్రాంతాల్లో జన గణన 2026 సెప్టెంబరు- అక్టోబరు 1 వరకు ఉంటుంది.