భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు.
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ రాష్ట్రపతి భవనం శీతల్ నివాస్‌లో 2024, నవంబరు 21న జనరల్ ద్వివేదిని ఈ గౌరవ హోదాతో సత్కరించారు.
1950 నుంచి రెండు దేశాల సైన్యాలు ఇలాంటి గౌరవ హోదాను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.