ఎఫ్‌ఐహెచ్ మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు జ్యోతి సింగ్ సారథ్యం వహించనుంది. నవంబరు 25 నుంచి డిసెంబరు 13 వరకు చిలీలోని శాంటియాగోలో జరుగనున్న టోర్నీ కోసం 20 మంది క్రీడాకారులతో భారత జట్టును 2025, నవంబరు 10న ప్రకటించారు. భారత మాజీ ఆటగాడు తుషార్ ఖండ్కర్ చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు.