జూనియర్ హకీ ప్రపంచకప్‌లో భారత జట్టు కాంస్యం నెగ్గింది. 2025, డిసెంబరు 10న ఆతిథ్య జట్టు అర్జెంటీనాను 4-2తో ఓడించి మూడో స్థానం సాధించింది. సెమీస్‌లో భారత్‌ను ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ.. ఫైనల్లో విజయం సాధించింది. ఆ జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో సమమైన ఫైనల్లో జర్మనీ షూటౌట్‌లో 3-2తో స్పెయిన్‌ను ఓడించింది.