షల్ (జర్మనీ) వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో 2025, మే 24న భారత్ మూడు పతకాలు సాధించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో శాంభవి స్వర్ణం గెలవగా.. ఓజస్వి ఠాకూర్ రజతం సాధించింది.
ఫైనల్లో శాంభవి 253.. ఓజస్వి 251.8తో తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. కార్లోటా (ఇటలీ, 230.5) కాంస్యం నెగ్గింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రణయ్ (227.9) కాంస్యం గెలిచాడు.
లివాన్‌లిన్ (చైనా, 250.3) స్వర్ణం, బ్రాడెన్ (అమెరికా, 250) రజతం గెలిచారు.