ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్-2026’ పురస్కారం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లెవిన్‌కు దక్కింది. 2026, ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్ వేదికగా ‘టెక్ బయో అన్‌షీల్డ్: ఏఐ ఆటోమేషన్-బయాలజీ రివల్యూషన్’ అనే థీమ్‌తో ‘బయో ఆసియా సదస్సు-2026’ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పురస్కార విజేతను ఫిబ్రవరి 10న ప్రభుత్వం ప్రకటించింది. సదస్సులోనే ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.