- దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ-2027లో భాగంగా తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గృహాలు, నిర్మాణాల జాబితాల తయారీ, వాటి నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ 2026, జనవరి 7న వెల్లడించింది. తొలుత 30 రోజుల పాటు అన్ని గృహాలు, నిర్మాణాల జాబితాను తయారు చేస్తారు.
- అనంతరం ప్రతి ఇంటికీ వెళ్లి ఏ తరహా నిర్మాణం, వంట గది, స్నానాల గది తదితర సదుపాయాల వివరాలను నమోదు చేస్తారు. ఈ దఫా కొత్తగా స్వీయ గణన నమోదు అవకాశాన్నీ కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.