హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘జనతా కీ కహానీ- మేరీ ఆత్మకథ’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ 2025, మే 9న దిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. దత్తాత్రేయ ఆయనకు జీవితంలో ఎదురైన విభిన్న కోణాలతోపాటు, పార్టీ కార్యకర్తల అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.