గర్భం దాల్చాలంటే తొలుత పిండం గర్భాశయ గోడకు అతుక్కోవాలి. ఈ ప్రక్రియలో జెనెటిక్ స్విచ్ కీలక పాత్ర పోషిస్తుందని గర్భధారణపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారణైంది. ఈ పరిశోధనలో బనారస్ హిందూ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) కలిసి పనిచేశాయి.
ఈ పరిశీలనలో హెచ్‌ఓఎక్స్‌ఏ 10, టీడబ్లూఐఎస్‌టీ2 అనే రెండు జన్యువులను కనుక్కున్నారు. ఇవి గర్భాశయ గోడ దగ్గర తలుపులా పనిచేస్తాయి. పిండం వచ్చేటప్పుడు హెచ్‌ఓఎక్స్‌ఏ 10 తాత్కాలికంగా ఆఫ్ అవుతుంది. టీడబ్లూఐఎస్‌టీ2 చర్య ప్రారంభిస్తుంది. గర్భాశయ గోడ తలుపు తెరచుకుంటుంది. ఈ జన్యువులే గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.