గుజరాత్‌లోని జూనాగఢ్‌లో కాలుష్యం సున్నా స్థాయిలో ఉంది. ప్రపంచంలో కోట్ల మందిని కాలుష్యం ఇబ్బంది పెడుతుందగా.. అక్కడ ఎలాంటి కాలుష్య జాడలు లేవు. దీనికి ప్రధాన కారణం ఆ పట్టణంలో లేదా జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల్లేవు. అటవీ ప్రాంతం కారణంగా అక్కడి చెట్లు కాలుష్యాన్ని తగ్గించడానికి కారణమవుతున్నాయి. దీపావళి సమయంలో బాణసంచా, జనం అధికంగా రావడంవల్ల కొంత ఇబ్బందులేర్పడతాయి. మిగిలిన కాలంలో ఇక్కడ కాలుష్యమనేదే కనిపించదు.