హస్తకళల్లో విశేష ప్రతిభ చూపుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులను కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులతో సత్కరించింది. 2025, డిసెంబరు 9న న్యూ దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.
అవార్డులు అందుకున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారుడు గోర్సా సంతోష్, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కళంకారి కళాకారిణి పి.విజయలక్ష్మి ఉన్నారు.