పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తారు.
భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల శాస్త్ర - సాంకేతిక విజయాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సాంకేతికత ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చారిత్రక నేపథ్యం:
1998, మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారత్ విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించింది. ‘ఆపరేషన్ శక్తి’గా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
ఈ పరీక్ష విజయవంతమయ్యేందుకు కారణమైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషిని అభినందించడంతోపాటు శాస్త్ర, సాంకేతికత ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏటా మే 11న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించారు. 1999 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.