Published on Dec 7, 2024
Current Affairs
జాతీయ పంచాయతీ అవార్డులు-2024
జాతీయ పంచాయతీ అవార్డులు-2024

కేంద్ర ప్రభుత్వం అందించే ‘జాతీయ పంచాయతీ అవార్డులు-2024’లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కింది.

కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 9 అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా 27 గ్రామపంచాయతీలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాలు ప్రకటించింది.

అందులో ‘ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ’ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీకి రెండో ర్యాంకు లభించింది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 2024, డిసెంబరు 6న ప్రకటన విడుదల చేసింది.