సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ పోలీసుశాఖకు ప్రతిష్ఠాత్మకమైన 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు లభించింది.
అస్సాం రాజధాని గువాహటిలో ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ గోయల్, సమాచార సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేఎస్‌పీవీ పవన్‌కుమార్ చేతులు మీదుగా ఈ అవార్డును తెలంగాణ పోలీసుశాఖలోని కంప్యూటర్స్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్ ఎస్పీ కిరణ్‌కుమారి, డీఎస్పీ ఎస్.రవిచంద్రలు అందుకున్నారు.
జాతీయస్థాయిలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు.