కేంద్ర జల్‌శక్తిశాఖ 2023 ఏడాదికి ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డులను 2024, అక్టోబరు 22న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అవార్డులు అందించారు.
విశాఖపట్నం దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తమ జిల్లాగా ప్రథమ బహుమతి అందుకుంది.
మొత్తం 9 కేటగిరీల్లో 38 మందిని విజేతలుగా ఎంపికచేశారు. జలసంరక్షణ అంశంలో ఆయా సంస్థలు చూపిన పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు.