Published on Nov 18, 2025
Current Affairs
జాతీయ గోపాలరత్న అవార్డు
జాతీయ గోపాలరత్న అవార్డు
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్‌ వెటర్నరీ అధికారి అనురాధకు జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారమైన ‘జాతీయ గోపాలరత్న అవార్డు’ వరించింది. ఆమె నంద్యాల జిల్లా గోస్పాడు మండలం చింతకుంట గ్రామీణ పశువైద్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఉత్తమ కృత్రిమ గర్భధారణ నిపుణుల విభాగంలో ఆమె జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. దేశంలో అన్ని కేటగిరీలకు కలిపి మొత్తం 2,081 మంది ఆయా అవార్డులకు పోటీపడ్డారు. మూడు కేటగిరీల్లో కలిపి కేవలం తొమ్మిది పురస్కారాలు ఉండగా వాటిలో ఒకటి అనురాధకు దక్కింది.
  • తెలంగాణ నుంచి కంకణాల కృష్ణారెడ్డి (73 ఏళ్లు) కేంద్ర ప్రభుత్వ జాతీయ గోపాల్‌రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. స్వదేశీ పశువులు, గేదెల పోషణ విభాగంలో ఉత్తమ పాడి రైతుగా ద్వితీయ బహుమతికి ఎంపిక చేసినట్లు కేంద్ర పశుసంవర్ధకశాఖ 2025, నవంబరు 17న వెల్లడించింది. కృష్ణారెడ్డి 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ పాడిరైతు పురస్కారాన్ని పొందారు.